
నారాయణపేట, ధన్వాడ, వెలుగు; ఇందిరమ్మ ఇళ్లను క్వాలిటీతో త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ఆదేశించారు. ధన్వాడ మండలంలోని అప్పక్‌పల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన ఇంటి పనులను పరిశీలించారు. మందిపల్లి ఈర్లగుట్ట వద్ద కందకాలు తవ్వుతున్న కూలీలతో మాట్లాడారు. నీడ లేదని వారు చెప్పడంతో ఫీల్డ్‌అసిస్టెంట్లపై అసహనం వ్యక్తం చేశారు.
తక్షణమే టెంట్లతోపాటు తాగునీరు, ప్రథమ చికిత్స కిట్టు వంటి వసతులు కల్పించాలని సూచించారు. అనంతరం వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరై, మాట్లాడారు. దొడ్డు, సన్న రకం వడ్లను కొనుగోలుకు వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరాలో సమస్యలు రాకుండా చూడాలన్నారు. దరఖాస్తుదారుల కోసం మున్సిపల్, ఎంపీడీవో ఆఫీస్‌లలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని సూచించారు.