నారాయణపేట, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణ మాఫీని 100 శాతం గైడ్ లైన్స్ ప్రకారం పూర్తి చేయాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల తో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిత్తల్, ట్రైనీ కలెక్టర్ గరీమాతో కలిసి ఆమె మాట్లాడారు.
నారాయణపేట జిల్లాలో తొలి విడత (రూ.లక్షలోపు) కింద 84, 684 మంది రైతులకు రూ.162 కోట్ల రుణాలను మాఫీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో పలువురు బ్యాంకు మేనేజర్లు ప్రస్తావించిన సమస్యలకు కలెక్టర్ పరిష్కార మార్గాలను
సూచించారు.