ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తాం : చౌహాన్

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తాం : చౌహాన్

ఆమనగల్లు, వెలుగు : ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు రాచకొండ సీపీ డీఎస్​ చౌహాన్​ చెప్పారు. గురువారం మాడుగుల పోలీస్ స్టేషన్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషనరేట్  పరిధిలో 24 చెక్ పోస్టులు రూ.40 కోట్ల నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2 వేల మందిని బైండోవర్​ చేశామని, మరికొందరిని చేయాల్సి ఉందన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ శ్రీనివాసులు, సీఐ రాజశేఖర్, ఎస్ఐలు ఉపేందర్, రాములు పాల్గొన్నారు.

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి

నారాయణపేట : జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్  కోయ శ్రీహర్ష తెలిపారు. పేట ఆర్డీవో ఆఫీస్​లో నామినేషన్ల స్వీకరణ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అడిషనల్​ కలెక్టర్  అశోక్ కుమార్, తహసీల్దార్​ రాణా ప్రతాప్  
పాల్గొన్నారు.

ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్  సక్రమంగా జరగాలి

గద్వాల,వెలుగు : ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్  సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్  వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డులో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించారు. నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల పంపిణీ సక్రమంగా నిర్వహించాలన్నారు. అనంతరం అలంపూర్  తహసీల్దార్​ ఆఫీస్​లో నామినేషన్ల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఆర్డీవో చంద్రకళ, ఎస్డీసీ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్లు  మంజుల, వెంకటేశ్వర్లు, వేణుగోపాల్  పాల్గొన్నారు.

వనపర్తి వ్యయ పరిశీలకుడిగా రాజేంద్ర సింగ్ 

వనపర్తి : వనపర్తి జిల్లా ఎన్నికల ఖర్చు పద్దుల పరిశీలకుడిగా రాజేంద్ర సింగ్ ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. వనపర్తికి వచ్చిన ఆయనకు కలెక్టర్  తేజస్  నందలాల్  పవార్  స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఇప్పటి వరకు సీజ్ చేసిన వాటి వివరాలు, ప్రకటనలకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. అడిషనల్​ కలెక్టర్ ఎస్.తిరుపతి రావు, ఆర్డీవో పద్మావతి, ఎస్డీసీ వెంకటేశ్వర్లు, నోడల్  ఆఫీసర్​ శ్రీనివాసులు పాల్గొన్నారు.

ALSO READ :  కోమటిరెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : గుమ్ముల మోహన్ రెడ్డి