నెలాఖరులోగా యువ వికాసం వెరిఫికేషన్ ​పూర్తవ్వాలి : కలెక్టర్ శ్రీజ

నెలాఖరులోగా యువ వికాసం వెరిఫికేషన్ ​పూర్తవ్వాలి : కలెక్టర్ శ్రీజ

ముదిగొండ, వెలుగు: ఈ నెలాఖరులోగా యువ వికాసం అప్లికేషన్ల వెరిఫికేషన్​పూర్తవ్వాలని జిల్లా ఇన్​చార్జి కలెక్టర్ శ్రీజ ఆదేశించారు. గురువారం ముదిగొండ ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తుల పరిశీలనను తనిఖీ చేశారు. మండలానికి సంబంధించి ఆన్ లైన్ ద్వారా 3,280 , ఆఫ్ లైన్ ద్వారా 1,955 అర్జీలు వచ్చాయనిని, ఇప్పటివరకు 1,243 దరఖాస్తుల ధ్రువీకరణ పూర్తి చేశామని ఎంపీడీవో శ్రీధర్ స్వామి ఆమెకు వివరించారు. 

యువతకు ఉపాధి దొరికేలా యూనిట్ల ఏర్పాటు జరగాలని ఇన్​చార్జి కలెక్టర్​పేర్కొన్నారు. లాభసాటి యూనిట్ల గ్రౌండింగ్​కు చర్యలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తు తిరస్కరిస్తే కారణాలు చెప్పాలన్నారు.  తహసీల్దార్ సునీత ఎలిజబెత్ తదితరులున్నారు.