
సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్ ఉంచొద్దని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణి అర్జీలు తీసుకోవడమే కాకుండా వాటిని పరిష్కరించి వారంలోగా రిపోర్ట్ తెలియజేయాలని అధికారులకు ఆదేశించారు. మొత్తం 56 అర్జీలు వచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం లో డీఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య టికెట్లు, వర్గ పోరు
మెదక్ టౌన్: కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ రాజర్షిషా, డీఆర్ఓ పద్మశ్రీతో తో కలిసి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 53 ఆర్జీలు వచ్చాయి. ఇందులో అత్యధికంగా ధరణి సమస్యలపై 28, గృహలక్ష్మి కోసం 4, దళిత బంధు 8, ఉపాధి అవకాశాలకోసం 6, ఇతర అంశాలకు సంబంధించి 8 ఆర్జీలు ఉన్నాయి. ఉద్యోగులు , ప్రజలకోసం కలెక్టరేట్ మొదటి అంతస్తులో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్యాంటీన్ ను కలెక్టర్ రాజర్షి షా , అడిషనల్ కలెక్టర్ రమేశ్ , వెంకటేశ్వర్లు తో కలిసి ప్రారంభించారు.