
మెదక్‌టౌన్, వెలుగు: పొలిటికల్ లీడర్లు ఎలక్షన్ కమిషన్ నిబంధనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్రాహుల్రాజ్సూచించారు. శనివారం మెదక్ కలెక్టరేట్లో అడిషనల్కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి ఎంసీఎంసీ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని మీడియా సెంటర్ ద్వారా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని అధికారులకు సూచించారు.
శాటిలైట్ ఛానెల్స్‌లో వచ్చే వార్తలను రికార్డు చేయాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సీ--విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. లేదంటే1950 టోల్ ఫ్రీ ద్వారా సమాచారం అందించాలన్నారు.