బతికున్నవ్యక్తి చనిపోయినట్లు రికార్డ్.. తహసీల్దార్ సస్పెండ్

బతికున్నవ్యక్తి చనిపోయినట్లు రికార్డ్.. తహసీల్దార్ సస్పెండ్

బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు చేసిన ఓ  తహసీల్దార్ సస్పెండ్ అయ్యిండు. అంతేగాదు ఏకంగా అతడి భూమిని ఇతరుల పేరు మీదకు మార్చాడు. దీంతో కలెక్టర్ అతడిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో జరిగింది.

తప్పుడు రికార్డులు సృష్టించి పట్టా మార్పిడి చేశాడని  భూ యజమాని ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్  విచారణ చేపట్టారు. విచారణ జరిపిన కలెక్టర్  నెన్నల మండలం  తహసిల్దార్ సబ్బా రమేష్ అక్రమంగా పట్టా మార్పిడి చేసినట్లు తేల్చారు.  విచారణ అనంతరం తహసీల్దార్ సబ్బా రమేష్ ను  సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారి చేశారు. అతడితో పాటు  ధరణి ఆపరేటర్ ఉదయ్, కాంట్రాక్టు ఉద్యోగిని విధులు నుంచి తొలగించారు.