మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం రెవెన్యూ మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణికి ఆయన హాజరై స్వయంగా ఫిర్యాదులను తీసుకున్నారు. క్యూలో నిలబడిన దివ్యాంగులు, వృద్ధుల వద్దకు కలెక్టర్ స్వయంగా వెళ్లి ఫిర్యాదులను స్వీకరించారు. హరితహారం కింద నాటిన మొక్కలన్నింటికి తప్పనిసరిగా జియో ట్యాగింగ్ చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. మహబూబ్నగర్చుట్టుపక్కల చెరువుల్లో గణేశ్విగ్రహాల నిమజ్జనం చేయొద్దని, ప్రభుత్వం బీచుపల్లి కృష్ణానదిలో నిమజ్జన ఏర్పాట్లు చేసిందని అక్కడే నిమజ్జనం చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఆర్డీవో అనిల్ కుమార్, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
రైతు వేదికలపై ప్రధాని ఫొటో పెట్టాలి
అమనగల్లు, వెలుగు: రైతు వేదికలపై ప్రధాని మోడీ ఫొటో పెట్టాలని నేషనల్ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఆమనగల్ మండలం రాంనూతల రైతు వేదికను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదికలకు కేంద్రప్రభుత్వం రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.12 లక్షలు కేటాయించాయని, అలాంటప్పుడు వేదికలపై సీఎం ఫొటో పెట్టి, ప్రధాని ఫొటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ప్రొటోకాల్గురించి అదే పనిగా మాట్లాడే ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ రైతు వేదికలపై ఆయన ఫొటోలు ఎందుకు పెట్టుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వేదికలపై వెంటనే మోడీ ఫొటో పెట్టకపోతే బీజేపీ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ ఆఫీస్ ముట్టడిస్తామని ఆచారి హెచ్చరించారు. బీజేపీ లీడర్లు రాంరెడ్డి, వెంకటేశ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
గురుకులాల్లో శానిటేషన్‌పై దృష్టి పెట్టండి
వనపర్తి, వెలుగు: జిల్లాలోని అన్ని గురుకుల హాస్టళ్లలో శానిటేషన్‌పై ఫోకస్ పెట్టి, స్టూడెంట్ల ఆరోగ్యాన్ని కాపాడాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో స్వచ్ఛ గురుకుల పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 6 నుంచి 12 వరకు జిల్లాలో ఉన్న 6 ఎస్సీ గురుకుల స్కూళ్లలో శానిటేషన్కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో హాస్టళ్లలో తగిన జాగ్రత్తలు పాటించేలా అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు ఆశిష్ సంగ్వాన్, డి.వేణుగోపాల్, డిప్యూటీ డీఎంహెచ్ వో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ విక్రమసింహా రెడ్డి పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ రుణ ప్రణాళిక రూ.4,825 కోట్లు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లా 2022–-23 ఫైనాన్షియల్ఇయర్ రుణ ప్రణాళికను కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సోమవారం ప్రకటించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ రూ. 4825.13 కోట్ల ప్రణాళికలో రూ. 4660.13 కోట్లు ప్రయారిటీ సెక్టార్‌కు కేటాయించామని, అందులోనూ రూ.4241.53 కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకే కేటాయించినట్లు తెలిపారు. త్రైమాసికంలో వివిధ సెక్టార్లలో నిర్ధేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లోన్ల విషయంలో నిర్ధేశించుకున్న లక్ష్యాలను సాధించకపోవడంపై కలెక్టర్ బ్యాంకర్లను నిలదీశారు. 69 ప్రపోజల్స్‌కు గాను 35 ప్రపోజల్స్ వివిధ కారణాలు చూపిస్తూ బ్యాంకర్లు తిరస్కరించడం సరికాదన్నారు. ట్రైకార్రుణాలలో క్లారిటీ లేకపోవడంతో ట్రైబల్ వెల్ఫేర్ఆఫీసర్పై కలెక్టర్ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి, అడిషనల్కలెక్టర్ మను చౌదరి, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ తదితరులు
పాల్గొన్నారు.
శివాలయం నిర్మాణానికి బీజేపీ నేత విరాళం
ధన్వాడ, వెలుగు : ధన్వాడలోని కుర్మన్పల్లి శివాలయం పునర్నిర్మాణం కోసం బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు, విండో డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్, జ్యోతి దంపతులు సోమవారం రూ.1,11,116 విరాళాన్ని ఆలయ పూజారి ఆనంద్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉమేశ్‌కుమార్, తిరుపతమ్మ, మెకానిక్ రాజు పాల్గొన్నారు.
చెరువులపై అన్ని హక్కులు మత్స్యకారులకే..
మహబూబ్‌నగర్, వెలుగు : చెరువులపై అన్ని హక్కులు మత్స్యకారులవేనని, వారి జీవన ప్రమాణాలు పెంచేందుకే ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోందని ఎక్సైజ్‌శాఖా మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్‌రూరల్ మండలం ధర్మాపూర్లోని కొత్త చెరువులో సోమవారం మంత్రి చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలోని 1,086 చెరువులలో 190.16 లక్షల చేప పిల్లలను వదలనున్నట్లు చెప్పారు. చేప పిల్లల విడుదల, పర్యవేక్షణ బాధ్యత మత్స్యకారులదేనని చెప్పారు. దళారులకు చెరువులు అప్పగించి నష్టపోవద్దని సూచించారు. చేప పిల్లల కౌంటింగ్, నాణ్యత గమనించాలని, ఏదైనా తేడా ఉంటే వెంటనే అధికారులకు చెప్పాలని సూచించారు. జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జిల్లా మత్స్య శాఖ ఆఫీసర్డి.రాధా రోహిణి పాల్గొన్నారు.
రైల్వే జీఎంను కలిసిన ఎంపీ రాములు
అలంపూర్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ను సోమవారం నాగర్ కర్నూల్ ఎంపీ రాములు హైదరాబాద్‌లోని రైల్వే నిలయంలో కలిశారు. పార్లమెంట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైల్వే పనులను పూర్తి చేయాలని వినతిపత్రం ఇచ్చారు. అలంపూర్ నియోజకవర్గంలో జోగులాంబ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు సమస్యలు ఎదుర్కొంటున్నారని జీఎం దృష్టికి తీసుకెళ్లారు. గద్వాల మాచర్ల రైల్వే లైన్ గురించి కూడా జీఎంతో చర్చించినట్లు ఎంపీ తెలిపారు.
చెంచుల జీవనోపాధికి మెరుగైన చర్యలు
అమ్రాబాద్/అచ్చంపేట, వెలుగు: చెంచుల జీవనోపాధి మెరుగుపర్చేందుకు ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) రాకేశ్ మోహన్ దోబ్రియాల్ చెప్పారు. సోమవారం లింగాల మండలంలోని బౌరాపూర్ చెంచు పెంటను ఆయన సందర్శించారు. చెంచులకు తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి, సేకరణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చెంచులతో కలిసి లంచ్ చేశారు. అనంతరం మన్ననూర్ సీబీఈటీ వద్ద పుట్టగొడుగుల పెంపకం కోసం తయారు చేసిన డార్క్ రూం ను ఆయన ప్రారంభించారు. ఏటీఆర్ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్, డీఎఫ్‌వో రోహిత్ గోపిడి, అచ్చంపేట ఎఫ్‌డీవో నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నల్లమలను టూరిజం హబ్‌గా తీర్చి దిద్దేందుకు కృషి
నల్లమల అటవీ ప్రాంతాన్ని టూరిజం హబ్గాతీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నామని రాకేశ్మోహన్దోబ్రియాల్ అన్నారు. అచ్చంపేట ఫారెస్ట్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లమలలో 3 ప్రాంతాలు టూరిజం ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించామన్నారు.
నాటిన ప్రతి మొక్కను బతికించాలి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : హరితహారంలో నాటిన ప్రతి మొక్కను బతికించాలని జడ్పీ చైర్పర్సన్ పద్మావతి అధికారులకు సూచించారు. సోమవారం గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, విద్య , వైద్యంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని వినిపించారు. హరితహారం మొక్కలను జంతువుల నుంచి కాపాడేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, జడ్పీటీసీలు గౌరమ్మ, హరిచరణ్ రెడ్డి, రాంబాబు పాల్గొన్నారు.
భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
గద్వాల, వెలుగు: భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి తహసీల్దార్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ నుంచి జిల్లాలోని తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ.. భూసమస్యలు పెండింగ్పడకుండా తహసీల్దార్లు రోజూ ఎన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారో రికార్డు మెయింటెయిన్చేయాలన్నారు. ఆర్డీవో రాములు, కలెక్టరేట్ ఏవో ఆజంఅలీ తదితరులు పాల్గొన్నారు.
నులి పురుగులను నిర్మూలిద్దాం
పిల్లల్లో నులి పురుగులను నివారించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని కలెక్టర్సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. మీటింగ్‌హాల్‌లో హెల్త్ డిపార్ట్‌మెంట్‌పై రివ్యూ నిర్వహించారు. ఈ నెల 15న నులిపురుగుల దినోత్సవం నిర్వహిస్తున్నారని, అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
మేడం.. హాస్టల్లో లెట్రిన్లు లేవ్
‘మేడం తమ హాస్టల్లో 475 మంది స్టూడెంట్లం ఉన్నాం.. సరిపడా లెట్రిన్లు లేక ఇబ్బంది పడుతున్నాం..’ అని వీరాపురం గురుకుల హాస్టల్స్టూడెంట్లు సోమవారం కలెక్టర్ వల్లూరు క్రాంతి దృష్టికి తీసుకెళ్లారు. స్వచ్ఛ గురుకులాల ప్రోగ్రాంలో భాగంగా కలెక్టర్ గురుకులాన్ని తనిఖీ చేశారు. లెట్రిన్లను, కిచెన్ షెడ్ ను, హాస్టల్, స్కూలు పరిసరాలను పరిశీలించారు. స్టూడెంట్లకు సరిపోయే లెట్రిన్లు వెంటనే కట్టాలని ఆఫీసర్లను ఆదేశించారు.
బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ గా రామకృష్ణారెడ్డి
ఉప్పునుంతల(వంగూరు), వెలుగు: బీజేపీ నాగర్ కర్నూల్ పార్లమెంటు కన్వీనర్ గా రాగి రామకృష్ణారెడ్డిని నియమించినట్లు బీజేపీ వంగూరు మండల అధ్యక్షుడు ఖానాపురం భాస్కర్ సోమవారం తెలిపారు. మండలంలోని ఎల్లమ్మ రంగాపూర్ గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి పార్టీ బలోపేతానికి కృషి చేసే వ్యక్తి అని కొనియాడారు.
గురువులను పూజిద్దాం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల కలెక్టర్లు జిల్లాలో బెస్ట్ టీచర్లుగా ఎంపికైన వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువుల సేవలు వెలకట్టలేనివని, ప్రతి ఒక్కరూ గురువులను పూజించాలని పిలుపునిచ్చారు. జడ్పీ చైర్పర్సన్లు, చైర్మన్లు, ఎమ్మెల్యేలు, అడిషనల్ కలెక్టర్లు, డీఈవోలు తదితరులు పాల్గొన్నారు.
- నెట్వర్క్, వెలుగు
ఉండవెల్లి, మానవపాడు మండలాల్లో భారీ వర్షం
ఉండవెల్లి, మానవపాడు మండలాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి 3 గంటల పాటు భారీ వర్షం పడింది. మెన్నీ పాడు, కలుగొట్ల, బొంకూరు, అమరవాయి,పెద్ద ఆముదాలపాడు, గోకులపాడు, -చెన్నిపాడు గ్రామాల మధ్య వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల పరిధిలో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.
- అలంపూర్/మానవపాడు, వెలుగు