సూర్యాపేట ప్రభుత్వ  ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

సూర్యాపేట ప్రభుత్వ  ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో  నిర్మిస్తున్న 650 పడకల భవన  నిర్మాణ పనులు వెంటనే  పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వైద్య అధికారులు, టీఎస్ఎమ్ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో నూతన భవన నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా నూతన భవన ప్లాన్  పరిశీలించి సూచనలు చేశారు.  మార్పుల కోసం టీఎస్‌ఎంఐడీసీకి ప్రతిపాదనలు పంపాలని సూచించారు.  హాస్పిటల్‌కి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.  పనుల్లో వేగం పెంచి భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులకి సూచించారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్  డాక్టర్ సత్యనారాయణ, టీఎస్ఎండీసీసీ దేవేందర్, ఈఈ జైపాల్ రెడ్డి, హెచ్ఓడీలు, ఏఈలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.