పాఠాలు చెప్పిన వనపర్తి కలెక్టర్

పాఠాలు చెప్పిన వనపర్తి కలెక్టర్

కొత్తకోట, వెలుగు: పట్టణంలోని ప్రభుత్వ బాలికల, బాలుర పాఠశాలను కలెక్టర్  తేజస్  నంద్ లాల్  పవార్  బుధవారం తనిఖీ చేశారు. స్టూడెంట్స్​తో ప్రేయర్ చేయించారు. క్లాస్​ రూమ్​కి వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ తనకు చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయని, శ్రద్ధగా చదువుకొని కలెక్టర్  అయ్యానని తెలిపారు. టీచర్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా విని ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. 

క్లాస్​ రూమ్స్​ సమస్య ఉందని ప్రిన్సిపాల్  సుమలత కలెక్టర్  దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్టర్ ను పిలిపించి క్లాస్​రూమ్​ పనులు త్వరగా కంప్లీట్​ చేయాలని ఆదేశించారు. అనంతరం పట్టణంలో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు.

 విధులను నిర్లక్ష్యం చేయవద్దు

వనపర్తి: విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్  తేజస్ నందలాల్  పవార్  హెచ్చరించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి  రోగులతో మాట్లాడారు. ఆసుపత్రి పరిసరాలతో పాటు రోగులకు ఉదయాన్నే ఇచ్చే పాలు, బ్రెడ్  నాణ్యతను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులను వైద్య సిబ్బంది ఆప్యాయతతో పలకరించి వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. వైద్య సిబ్బంది చైతన్య గౌడ్  
పాల్గొన్నారు.