టెన్త్​ ఎగ్జామ్ ​సెంటర్ ​తనిఖీ

టెన్త్​ ఎగ్జామ్ ​సెంటర్ ​తనిఖీ

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట పట్టణంలోని కాకతీయ హైస్కూల్​ టెన్త్​ఎగ్జామ్ ​సెంటర్​ను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శనివారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, సౌకర్యాలపై ఆరా తీశారు. పరీక్షలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, సెంటర్​చీఫ్ సూపరింటెండెంట్ శ్రీహరి ఉన్నారు. కాగా, జిల్లాలో రెండో రోజు పరీక్షకు11,901 విద్యార్థులకు గానూ 11,876 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు.  

యాదాద్రి, వెలుగు: జిల్లాలోని పలు టెన్త్​ఎగ్జామ్​సెంటర్లను కలెక్టర్​హనుమంతరావు, అడిషనల్ ​కలెక్టర్ వీరారెడ్డి, డీఈవో సత్యనారాయణ శనివారం తనిఖీ చేశారు. హిందీ ఎగ్జామ్​8,605 మంది విద్యార్థులు రాయగా 12 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.