సూర్యాపేట, వెలుగు : విద్యార్థులకు గుణాత్మకమైన విద్యనందించడంతోపాటు నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెన్ పహాడ్ మండలంలో జడ్పీహెచ్ఎస్, ఎంపీహెచ్ ఎస్ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తరగతి గదులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు.
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. కుల, ఆదాయ సర్టిఫికెట్లను విద్యార్థులకు సత్వరమే అందించాలని సూచించారు. అనంతరం పీహెచ్‌సీని తనిఖీ చేశారు.
గరిడేపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
గరిడేపల్లి, వెలుగు : గరిడేపల్లి మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. మండలంలోని గడ్డిపల్లి శివారులో ఇటీవల సీజ్ చేసిన రైస్‌మిల్లును పరిశీలించారు. అనంతరం మోడల్ స్కూల్, జడ్పీహెచ్ఎస్, ఎస్సీ వసతి గృహం, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించారు. ఆరోగ్యకేంద్రంలో శానిటేషన్ సరిగ్గా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డీఎంఎచ్వోకి ఫోన్ చేసి ఆరోగ్యకేంద్రం పరిస్థితి బాగాలేదని, పూర్తిగా ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు.
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. అక్కడే ఉన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ కవిత, ఇన్చార్జి ఎంపీడీవో సోమసుందర్‌రెడ్డి, మండల విద్యాధికారి చత్రునాయక్ తోపాటు అధికారులు ఉన్నారు.
విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్..
గరిడేపల్లి మండలం గడ్డిపల్లి లో తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలోని గ్రౌండ్ , క్లాస్ రూములను పరిశీలించారు. ఇంటర్ ఫస్టియర్ బైపీసీ క్లాసును కలెక్టర్ సందర్శించారు. అక్కడ భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడు డి.రవీంద్ర నాయక్ పిల్లలకు ఫిజిక్స్ లోని ఫార్ములా గురించి వివరించారు.