టెన్త్​ ఫలితాల్లో టాప్​లో ఉండాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

టెన్త్​ ఫలితాల్లో టాప్​లో ఉండాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, వెలుగు : పదో తరగతి ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ టీచర్లకు సూచించారు. శుక్రవారం ఇమాంపేట తెలంగాణ ఆదర్శ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు . ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం, మెనూను ఆయన పరిశీలించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న కెరియర్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి  విద్యార్థులకు దిశానిర్దేశం చేసి వారిలో ఉన్న భయాన్ని తొలగించాలన్నారు. రానున్న 50 రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకుని మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో  కె.అశోక్, క్వాలిటీ కో–ఆర్డినేటర్ జనార్దన్, ప్రిన్సిపాల్ బి.రమేశ్, రిసోర్స్ పర్సన్స్ పవిత్ర, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, జాఫర్, రమేశ్ బాబు, చంద్రశేఖర్ రెడ్డి, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.