విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి : కలెక్టర్ తేజస్ నందలాల్

సూర్యాపేట, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం కేసారం మొదటి, రెండో ఫేస్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ప్రైమరీ పాఠశాల, సూర్యాపేటలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్, జడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డబుల్​బెడ్ రూమ్​ ఇండ్లకు విద్యుత్ కనెక్షన్, వాటర్ లైన్, శానిటరీ పనులు మొదలు పెట్టనందున అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పిల్లల హాజరు శాతం ఎక్కువగా ఉండాలని చెప్పారు. అనంతరం ఫేస్ –2 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులపై ఆర్డీవో, ఆర్ అండ్ బి, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేసారం ఫేస్ -2 డబుల్​బెడ్​రూమ్​ ఇండ్లలో సంప్ పనులు, సీపీ రోడ్లు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.