విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

కోదాడ, వెలుగు : ​విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కోదాడలోని బాలుర హాస్టల్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్​లోని రికార్డులు, స్టోర్ రూమ్, కిరాణ సామగ్రి, కూరగాయలను పరిశీలించారు. 

కర్రీ, సాంబార్ ను కలెక్టర్ పరిశీలించి రుచి చూశారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. అంతకుముందు కోర్టు నిర్మాణం కోసం కేటాయించిన ఎన్ఎస్పీ స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. 

 ఆయన వెంట ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ సూరయ్య, డిప్యూటీ తహసీల్దార్ మాషానాయక్, సర్వేయర్ నాగార్జున, హాస్టల్ వార్డెన్ సైదులు, అధికారులు ఉన్నారు.