విద్యార్థి భవిష్యత్ కు పదో తరగతి ఫలితాలే పునాది : తేజస్ నందలాల్ పవార్

విద్యార్థి భవిష్యత్ కు పదో తరగతి ఫలితాలే పునాది :  తేజస్ నందలాల్ పవార్
  • కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్  

సూర్యాపేట, వెలుగు : విద్యార్థి భవిష్యత్ కు పదో తరగతి ఫలితాలే పునాది అని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గురువారం చివ్వెంల మండలం బి.చందుపట్ల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. 

పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై ప్రిన్సిపాల్ శ్రీనివాస్, సంబంధిత ఇంజినీరింగ్ అధికారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతం స్కూల్ లో అమలు చేస్తున్న మెనూను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.