
- కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, వెలుగు : ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఫిబ్రవరి 27న జరిగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పీవో, ఏపీవో, ఓపీవో, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ఒక్కరికీ విధుల నుంచి మినహాయింపు లేదని, అందరూ తప్పనిసరిగా విధులకు హాజరుకావాలన్నారు. ఎన్నికల ముందు రోజే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు.
అక్కడ తమకి కేటాయించిన పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఓటర్ల జాబితా, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఎలక్షన్ సామగ్రి ఉన్నాయో.. లేవో జాగ్రత్తగా పరిశీలించాలని వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి పీవో, ఏపీవో, ఇద్దరు ఓపీవోలు, నలుగురు సిబ్బందిని కేటాయిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబు, ఎలక్షన్ సూపరింటెండెంట్శ్రీనివాసరాజు, డీటీ వేణు, ఎలక్షన్ ట్రైనర్స్ రమేశ్, వెంకటేశ్వర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలింగ్‌పై అవగాహన కలిగి ఉండాలి
యాదాద్రి, వెలుగు : పోలింగ్ ప్రక్రియపై సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో టీచర్ఎమ్మెల్సీ ఎన్నికల పోలిం ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలకు రెండో విడత శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్టర్ ట్రైనర్ల ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని తెలుసుకోవాలని సూచించారు.
అధికారులు అవగాహన కలిగి ఉండాలి
నల్గొండ అర్బన్, వెలుగు : వరంగల్,- ఖమ్మం,- నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలని అడిషనల్ కలెక్టర్ జె. శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో పీవో,ఏపీవో, సెక్టోరల్ ఆఫీసర్లకు రెండో విడత శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాలెట్ పేపర్లను ఎలా వినియోగించాలో ఆయన వివరించారు.