సూర్యాపేట, వెలుగు: ఉద్యోగుల కోసం కలెక్టరేట్ లో ప్రత్యేకంగా ఎస్బీఐ బ్రాంచ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఎస్బీఐ ఇంటెన్సివ్ బ్రాంచ్ ను అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ బ్యాంక్ ద్వారా ప్రతి రోజు క్యాష్ లావాదేవీలు జరుగుతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ఉద్యోగులు వినియోగించుకోవాలని సూచించారు.
బ్యాంక్ సిబ్బంది సమయ పాలన పాటిస్తూ మెరుగైన సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ ఉపేంద్ర భాస్కర్, ఎల్డీఎం బాపూజీ, బ్యాంక్ మేనేజర్ అఖిల, సిబ్బంది పాల్గొన్నారు.