సీఎం రేవంత్ రెడ్డి సభకు ఏర్పాట్లు ముమ్మరం : తేజస్ నందలాల్ పవార్

సీఎం రేవంత్ రెడ్డి సభకు ఏర్పాట్లు ముమ్మరం : తేజస్ నందలాల్ పవార్
  • కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

హుజూర్ నగర్, వెలుగు : ఈనెల 30న హుజూర్​నగరలో సీఎం రేవంత్​రెడ్డి పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశామని, ఉగాది పర్వదినాన సన్న బియ్యం పంపిణీ పథకాన్ని సీఎం ప్రారంభించి బహిరంగ సభలో మాట్లాడతారని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా మంగళవారం హుజూర్ నగర్ లో బహిరంగ సభ ఏర్పాట్లను ఎస్పీ నరసింహతో కలిసి పరిశీలించారు. 

అప్రోచ్ రోడ్లు, పార్కింగ్ స్థలాలు, హెలిపాడ్ పార్కింగ్, వీఐపీల ప్రొటోకాల్, సభావేదిక, ప్రజల కోసం తాగునీరు, మజ్జిగ పంపిణీ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి బహిరంగ సభ ఏర్పాట్లపై సమీక్షించారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు.  

ఏర్పాట్లను పరిశీలించిన సివిల్ సప్లై జాయింట్ సెక్రటరీ..

హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభా ఏర్పాట్లను రాష్ట్ర సివిల్ సప్లై జాయింట్ సెక్రటరీ ప్రియాంక అలా పరిశీలించారు. ఆమెకు కలెక్టర్ స్వాగతం పలికి బహిరంగ సభకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు.