భూభారతితో భూసమస్యలు పరిష్కారం : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్  

భూభారతితో భూసమస్యలు పరిష్కారం : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్  

సూర్యాపేట, పెన్ పహాడ్ వెలుగు : భూభారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేటలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంలో తహసీల్దార్ స్థాయి నుంచి సీసీఎల్ఏ స్థాయి వరకు సమస్యలు పరిష్కరించేందుకు వెసులుబాటు కల్పించారని తెలిపారు. భూమి రిజిస్ట్రేషన్ ముందు తప్పనిసరిగా భూసర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందన్నారు. రెవెన్యూ రికార్డుల నిర్వహణలో భాగంగా ఏటా డిసెంబర్ 31న ప్రతి రైతుకు నూతన వన్ బీ అందజేస్తామని వెల్లడించారు.  

భూ సమ్యలు పరిష్కరించేందుకే భూభారతి..

చౌటుప్పల్, వెలుగు : రైతుల సమస్యలను పరిష్కరించేందుకే భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ  కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ భూభారతి చట్టంలో తిరిగి అనుభవదారు కాలాన్ని పెట్టడం శుభపరిణామమన్నారు. కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో శేఖర్ రెడ్డి, అధికారులు  పాల్గొన్నారు.