జూలై 30న రెండో విడత రుణమాఫీ

సూర్యాపేట, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 30న రెండో విడత రుణమాఫీ చేయనున్నట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో రెండో విడత రుణమాఫీ కింద  70 వేల మంది రైతులకు రూ.లక్ష నుంచి రూ1.50 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేయనున్నట్లు తెలిపారు. 

ఈనెల 30న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ కార్యాలయంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, అదే రోజున అర్హులైన రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.