ఉండ్రు గొండ గిరిదుర్గాన్ని పర్యాటక ప్రాంతంగా మారుస్తాం : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

ఉండ్రు గొండ గిరిదుర్గాన్ని  పర్యాటక ప్రాంతంగా మారుస్తాం : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, వెలుగు:   ఉండ్రు గొండ గిరిదుర్గం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని   కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.   బుధవారం చివ్వెంల మండలం ఉండ్రుగొండ  లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం కమిటీ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను చూశారు.  ఉండుగొండ సందర్శన అనంతరం తిరిగి వస్తుండగా   కాలేజీ విద్యార్థులు కలెక్టర్  తేజస్ నంద్ లాల్ పవార్ ను  కలిశారు. 

  ఈ  కార్య్రమంలో ఆర్డీఓ  వేణుమాధవ్, డీఎఫ్ఓ సతీశ్​ కుమార్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి   రమేశ్​ కుమార్, ఉండ్రుగొండ పర్యాటక అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు   ఆదూర్తి రామయ్య, కార్యదర్శి మహేశ్వరం రవిచంద్ర  తదితరులు  పాల్గొన్నారు.