సర్కారు పథకాలపై విస్తృత ప్రచారం : కలెక్టర్ ​జస్ నందలాల్ పవర్

సర్కారు పథకాలపై విస్తృత ప్రచారం : కలెక్టర్ ​జస్ నందలాల్ పవర్
  • ప్రజాపాలన కళాయాత్ర ప్రచార రథాన్ని ప్రారంభించిన 
  • కలెక్టర్​ తేజస్ నందలాల్ పవర్

సూర్యాపేట, వెలుగు: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 19 నుంచి డిసెంబర్ 7 వరకు ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్ ​జస్ నందలాల్ పవర్ అన్నారు. మంగళవారం ప్రజా పాలన కళాయాత్ర ప్రచార రథాన్ని కలెక్టర్ ఆఫీసు వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..షెడ్యూల్ ప్రకారం కళాయాత్ర కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఎవరైనా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డి, డీఐఈ మల్లేశ్, కళాకారులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

కోదాడ: సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్  సూచించారు. బుధవారం పీఏసీఎస్​పరిధిలోని తమ్మర గ్రామ శివారులో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 60 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతులకు వెంటనే వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలోని ప్రతీ మండలంలో తహసీల్దార్, ఎంపీడీవో, ఏవో , పోలీసులు, ఐకేపీ సెంటర్ ఉంటే ఏపీఎం, లేక పీఏసీఎస్​ఉంటే వాటికి సంబంధించిన వారితో కలిపి ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇందులో ఉన్న సభ్యులు మండలంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం చిమిర్యాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

అల్వాల్ పురం గ్రామంలో ఉన్న వెంచర్​ను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవో సూర్యనారాయణ, పీఏసీఎస్​చైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి, రఘుపతి, ఏవో రజని, సీఈవోలు కృష్ణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.