సహకార సొసైటీల బలోపేతానికి చర్యలు : తేజస్ నందలాల్ పవార్

 సహకార సొసైటీల బలోపేతానికి చర్యలు  : తేజస్ నందలాల్ పవార్
  • కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్  

సహకార సొసైటీల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో జిల్లా కో–ఆపరేటివ్ అభివృద్ధి కమిటీ, జాయింట్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను సిద్ధం చేయాలన్నారు. పీఏసీఎస్​ ద్వారా కామన్ సర్వీస్ సెంటర్లపై అధికారులకు శిక్షణ ఇప్పించి వాటిని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

 గ్రామాల్లో డెయిరీ డెవలప్​మెంట్, పాల ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు కోసం ఆర్థిక స్థితిగతులను ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. లోన్స్​ద్వారా మహిళా సంఘాలకు డ్రోన్స్ అందజేయాలని సూచించారు. పీఏసీఎస్​చింతలపాలెంలో కోల్డ్ స్టోరేజ్ కోసం డీపీఆర్​సిద్ధం చేయాలన్నారు. పది వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన స్టోరేజ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ అప్పారావు, జిల్లా కో–ఆపరేటివ్ ఆఫీసర్ పద్మ, నాబార్డ్ ఏజీఎం ఎన్.సత్యనారాయణ, డీసీసీబీ బ్యాంకు సీఈవో శంకర్రావు, వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.