మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి : కలెక్టర్ తేజస్

  •     కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

సూర్యాపేట , వెలుగు : మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని, ఆ దిశగా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగుల వయోవృద్ధుల శాఖలపై జిల్లా అధికారులు, సఖి సెంటర్ సిబ్బంది, బీ ఆర్ బీ  కో–ఆర్డినేటర్లతో సమీక్ష నిర్వహించారు. అంగన్​వాడీ సెంటర్లలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా  సాధికారత, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు.  సమావేశంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి వి.వెంకటరమణ, సీడీపీవోలు పారిజాత, కిరణ్మయి, శ్రీవాణి, రూప,హేమదేవి, శ్రీజ, డీసీపీవో రవి, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ వినోద్ కుమార్, సఖి అడ్మిన్ హేమలత, సంకల్ప్ జిల్లా కో–ఆర్డినేటర్ చైతన్య పాల్గొన్నారు.