జనవరి 15లోపు పనులు పూర్తిచేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

జనవరి 15లోపు పనులు పూర్తిచేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు : జనవరి 15లోపు డబుల్​బెడ్​రూమ్ ఇండ్ల మరమ్మతు పనులు పూర్తిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కాంట్రాక్టర్లు, అధికారులకు సూచించారు. నల్గొండ అర్బన్ కాలనీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డబుల్​బెడ్​రూమ్​ ఇండ్లలో తాగునీటి సరఫరా, మురుగునీటి పనులు, విద్యుత్ తదితర పనులన్నీ త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. 

కాలనీలో సుమారు 550 గృహాలు జీ ప్లస్ టు మోడల్ లో నిర్మిస్తున్న ఇండ్లను పరిశీలించారు. ఆమె వెంట మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గృహ నిర్మాణం పీడీ రాజ్​కుమార్, పంచాయతీరాజ్ ఎస్ఈ తిరుపతయ్య, ఈఈపీఆర్ పాల్గొన్నారు.