మెరుగైన వైద్య సేవలు అందించాలి : ఇలా త్రిపాఠి

  • కలెక్టర్ ఇలా త్రిపాఠి 

చండూరు (మర్రిగూడ), వెలుగు : ప్రభుత్వాస్పత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి డాక్టర్లకు సూచించారు. గురువారం మర్రిగూడ 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఔట్ పేషెంట్ల వివరాలు, స్టాఫ్ వివరాలు, మందులు, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఆస్పత్రిలో నిర్వహిస్తున్న ప్రసవాలు, ఇమ్యునైజేషన్ పై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. 

సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ మొదటి కాన్పుల విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులకు సూచించారు. అనంతరం గిరిజన బాలర వసతి గృహాన్ని తనిఖీ చేసి వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని సందర్శించి  7 వ తరగతి విద్యార్థులతో సైన్స్ లో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. చండూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా చేశారు. ఆమె  వెంట చండూరు ఆర్డీవో శ్రీదేవి, సీహెచ్ సీ హాస్పిటల్ సూపరింటెండెంట్, అధికారులు ఉన్నారు.