ధరణి దరఖాస్తులు పెండింగ్ లో ఉంచొద్దు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

కేతేపల్లి (నకిరేకల్) వెలుగు :  ధరణి దరఖాస్తులు పెండింగ్ లో  పెట్టొద్దని  కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.  బుధవారం ఆమె  కేతేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని  తనిఖీ చేశారు.  ధరణి ఫైళ్లను, ధరణి పోర్టల్ లో పెండింగ్ దరఖాస్తులను పరిశీలించారు.  ఎలాంటి సమస్య లేకున్నా పదేపదే సమర్పించే బోగస్ దరఖాస్తుల పై ప్రత్యేక దృష్టి పెట్టి మరో సారి దరఖాస్తు చేయకుండా చర్య తీసుకోవాలని చెప్పారు.  

  బండపాలెం  గ్రామానికి చెందిన భూమి సమస్యపై వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడారు.    గ్రామాల్లో  పారిశుధ్యం కొరవకుండా చర్యలు తీసుకోవాలని ,ఇందిరమ్మ ఇండ్ల సర్వే డేటా ఎంట్రీ తదితర అంశాలపై సూచనలు చేశారు. తరచు పాఠశాలలు,ఇతర సంస్థలు సందర్శించాలని ఆదేశించారు. తహసీల్దార్ మదు సూదన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.