ఏటూరునాగారం, వెలుగు : గర్భిణులు, పిల్లలు రక్తహీనతకు గురికాకుండా చూడాలని కలెక్ట్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం ఐటీడీఏ ఆఫీస్‌లో నిర్వహించిన రివ్యూలో ఆమె మాట్లాడారు. గొత్తి కోయల్లో అర్హులైన వారి పేర్లను అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదు చేసి, వారికి పోషకాహారం అందజేయాలని సూచించారు.
గ్రామాలకు దూరంగా ఉంటున్న గొత్తి కోయ గూడాలను సందర్శించి పోషకాహార ఆవశ్యకతను వివరించాలని చెప్పారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీజ, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ ప్రేమలత, సీడీపీవోలు హేమలత, మల్లేశ్వరి, శిరీష పాల్గొన్నారు.