జనవరి నెలాఖరు లోగా మేడారం జాతర పనులవ్వాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

తాడ్వాయి, వెలుగు : మేడారం మహా జాతర అభివృద్ధి పనులు జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె తాడ్వాయి మం డలం మేడారంలో పర్యటించి, అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ముందుగా ఆర్టీసీ బస్టాండు స్థలం, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. అనంతరం మేడారంలోని ఐటీడీఏ గెస్ట్ హౌస్ లో ఐటీడీఏ పీఓ అంకిత్ అదనపు కలెక్టర్ బి వేణుగోపాల్

హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారులుతో కలెక్టర్​ఇలా త్రిపాఠి సమావేశమయ్యారు. మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించిందని, పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. సంబంధిత అధికారులు డెయిలీ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, జాతరలో పూర్తిగా ప్లాస్టిక్ ను నిషేధించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ నాగపద్మజ, డీపీఓ వెంకయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

ములుగు, వెలుగు : స్టూడెంట్లు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ములుగు జిల్లా కలెక్టర్​ఇలా త్రిపాఠి చెప్పారు. శుక్రవారం ములుగులోని డీఎల్ఆర్ గార్డెన్ లో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశలో విద్యతోపాటు క్రీడల్లో వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్​సూచించారు.

క్రీడలతో నాయకత్వ లక్షణాలు అలవడుతాయన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ స్కూళ్లు, కాలేజీల స్టూడెంట్లు ఆట, పాటలతో అలరించారు.  జిల్లా యువజన క్రీడల అధికారి వెంకయ్య, జిల్లా వైద్య అధికారి అప్పయ్య, విద్య శాఖ అధికారి పాణిని తదితరులు పాల్గొన్నారు.