ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన ఉండాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

ములుగు, వెలుగు : ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకొని   క్రమశిక్షణ పాటించాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్​   నుంచి బండారుపల్లి గిరిజన భవన్​ వరకు  2కే   రన్​ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి మార్చి 2 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు.  

ప్రజలు ఆర్థిక వ్యవహారాలపట్ల అవగాహన పెంచుకోవాలన్నారు.  కుటుంబ పోషణ, వ్యాపారాలు, ఇతర ఖర్చులపై క్రమశిక్షణ పాటిస్తూ పొదుపుకోసం కృషి చేయాలని సూచించారు. ఆర్థిక క్రమశిక్షణ ద్వారా ఎంతో ఎదుగుదల సాధ్యమవుతుందని కలెక్టర్​ వివరించారు. ఎల్​డీఎం రాజ్​ కుమార్​, డీఆర్​డీవో శ్రీనివాస్​, సిబ్బంది పాల్గొన్నారు.