- కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. గురువారం వేములపల్లి, తిప్పర్తి ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రం సిబ్బంది హాజరు రిజిస్టర్, అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు, డెలివరీల రిజిస్టర్లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రంలో ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. కుక్క, పాము కాటుపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆస్పత్రిలో అన్ని రకాల మందులు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. వైద్యులు, సిబ్బంది సకాలంలో విధులకు హాజరుకావాలని తెలిపారు. ఆయన వెంట అధికారులు, డాక్టర్లు, సిబ్బంది ఉన్నారు.