ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలి : ఉదయ్ కుమార్

ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా  నిర్వహించాలి : ఉదయ్ కుమార్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  తమ విధులను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని  ఎన్నికల అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఉదయ్ కుమార్ సూచించారు. గురు వారం  కలెక్టరేట్ లో  ఎన్నికల శిక్షణ తరగతులకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా  ఈవీఎం, వీవీ ప్యాట్‌‌‌‌‌‌‌‌లపై ఇస్తున్న శిక్షణ గురించి  తెలుసుకున్నారు.  ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తిచేసుకోవాలని సూచించారు. 

ఈవీఎంలు, వీవీ ప్యాట్‌‌‌‌‌‌‌‌లపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు.  మాక్ పోల్ నిర్వహించే సమయంలో వీవీ ప్యాట్‌‌‌‌‌‌‌‌లు రీప్లేస్ చేయాల్సి వస్తే, తిరిగి మాక్ పోల్ నిర్వహించాల్సిన అవసరం లేదని  సూచించారు. ఎన్నికల నిర్వహణకోసం అధికారులను పూర్తిస్థాయిలో సర్వసన్నద్ధం చేయాలన్నారు.  అధికారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్ కుమార్ దీపిక, శిక్షణ నోడల్ అధికారి నర్సింగరావు,  మాస్టర్ ట్రైనర్స్ చంద్రశేఖర రావు, రాజశేఖర్ రావు, బాలరాజ్ పాల్గొన్నారు.