నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని అధికారులకు కలెక్టర్ ఉదయ్ కుమార్ సూచించారు. గురువారం కలెక్టరేట్ లో తహసీల్దార్లు, ఆర్డీవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 23న ఎన్నికల కమిషన్ నిర్వహించే ప్రత్యేక సమావేశానికి నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీవోలు హనుమాన్ నాయక్, పాండు నాయక్, తహసీల్దార్లు, డీటీలు పాల్గొన్నారు.
పశువుల అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలి
జిల్లాలో పశువుల అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో చాంబర్‌లో జంతు సంరక్షణ సామాజిక బాధ్యతపై సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలోని కొట్ర, హాజీపూర్, తిమ్మాజిపేట ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి జంతు రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో డీఎఫ్వో రోహిత్ , పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేశ్, రవాణా శాఖ అధికారి ఎర్రిస్వామి, అధికారులు పాల్గొన్నారు.