మొదటి విడత ర్యాండమైజేషన్​ కంప్లీట్: కలెక్టర్ ఉదయ్ కుమార్

మొదటి విడత ర్యాండమైజేషన్​ కంప్లీట్: కలెక్టర్ ఉదయ్ కుమార్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్  పూర్తి చేసి రిటర్నింగ్  ఆఫీసర్లకు అప్పగించినట్లు నాగర్​కర్నూల్​ కలెక్టర్ ఉదయ్ కుమార్  తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్  కాన్ఫరెన్స్  హాల్​లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను రిటర్నింగ్​ ఆఫీసర్లకు అప్పగించారు.రిటర్నింగ్  ఆఫీసర్లు కుమార్ దీపక్, వెంకట్ రెడ్డి, గోపిరాం, ఈవీఎం నోడల్  ఆఫీసర్​ కె సీతారామారావు, జాకీర్ అలీ, రఘు పాల్గొన్నారు.

గద్వాల: ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల మొదటి రాండమైజేషన్  ప్రక్రియ పూర్తి చేసినట్లు గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. ఐడీవోసీ వీడియో కాన్ఫరెన్స్​ హాల్​లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో  కంట్రోల్, బ్యాలట్ యూనిట్లు, వీవీ ప్యాట్ల రాండమైజేషన్  నిర్వహించారు. అడిషనల్​ కలెక్టర్లు చీర్ల శ్రీనివాస్, అపూర్వ్ చౌహాన్, ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్  నరేందర్, సి సెక్షన్  సూపరింటెండెంట్​ నరేశ్  పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ కలెక్టరేట్: ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన సి విజిల్  ఫిర్యాదుల విభాగంలో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్  జి.రవినాయక్  అన్నారు. కలెక్టరేట్  మీటింగ్  హాల్​లో సి విజిల్ యాప్  పర్యవేక్షణకు నియమించిన 24 గంటల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్  ఆవరణలోని ఈవీఎంల ర్యాండమైజేషన్  ప్రక్రియను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు. అడిషనల్​ కలెక్టర్  ఎస్. మోహన్ రావు, ఆర్డీవో అనిల్ కుమార్, స్పెషల్  కలెక్టర్  నటరాజ్  పాల్గొన్నారు.

నారాయణపేట: ఎన్నికలలో పీవో, ఏపీవోలదే కీలకపాత్ర అని మహబూబ్​నగర్​ కలెక్టర్  కోయ శ్రీహర్ష పేర్కొన్నారు.  శుక్రవారం డీఆర్డీఏ స్కిల్  డెవలప్​మెంట్ సెంటర్ లో పీవో, ఏపీవోల ట్రైనింగ్​ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలింగ్  సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి పెట్టాలని, హ్యాండ్ బుక్ లోని అన్ని నియమాలను పాటించాలని సూచించారు. . ఆర్డీవో​రాంచందర్, డీఆర్డీవో గోపాల్ నాయక్, డీబీసీడీవో కృష్ణమాచారి, డీఈవో  ఘని పాల్గొన్నారు.