దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ వల్లూరి క్రాంతి

దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ వల్లూరి క్రాంతి

కంది, వెలుగు : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని రిక్షా కాలనీలో కలెక్టర్, డీఎంహెచ్​వో గాయత్రి దేవి, మున్సిపల్ ఆఫీసర్లతో కలిసి సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. దోమల నివారణకు ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. అధికారులు ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలను సందర్శించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మందులు సిద్ధంగా ఉంచుకోవాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని, మున్సిపల్, వైద్య ఆరోగ్యశాఖల ఆఫీసర్లు అందరూ సమన్వయంతో కలిసి పని చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.