గద్వాల, వెలుగు: జిల్లాలో గృహలక్ష్మి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఎంపీడీవోలు, తహ సీల్దారులను కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో గృహలక్ష్మి, ఓటరు నమోదు, పెన్షన్ లపై మీటింగ్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో గృహలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో సొంత స్థలం ఉండి బేస్మెట్ కట్టించుకునే వారిని ముందుగా గుర్తించాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
ALSO READ:జిల్లాలో రూ. 953 కోట్ల రుణ మాఫీ: కలెక్టర్ రవినాయక్
పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వివరాలు పంపాలన్నారు. ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయాలన్నారు. జిల్లాలోని గద్వాల మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు. వడ్డేపల్లి, ఐజ, అలంపూరు మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల ప్రత్యేక నిధులు వచ్చాయన్నారు. వాటితో చేసే పనులకు ఎస్టిమేషన్లు రెడీ చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు శ్రీనివాస్,అపూర్వ్ చౌహాన్ పాల్గొన్నారు.