గద్వాల, వెలుగు: ప్రతి బాలిక చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి కోరారు. శుక్రవారం అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడ పిల్లలకు చదువే ఆధారమనే విషయం గుర్తించాలన్నారు. తన తల్లి స్ఫూర్తితో ఐఏఎస్ అయ్యానని చెప్పారు.
ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం పట్టణంలోని క్రష్ రూమ్ ను ఆమె పరిశీలించారు. డ్యూటీకి వెళ్లే మహిళలు తమ ఐదేండ్ల పిల్లలను ఆ రూమ్ లో సంరక్షణ కోసం వదిలి వెళ్ల వచ్చన్నారు. అడిషనల్ కలెక్టర్లు అపూర్వ్ చౌహాన్, శ్రీనివాస్, శిశు సంక్షేమ శాఖ ఆఫీసర్ ముసాయిదా బేగం, హృదయ రాజు, రమేశ్ బాబు పాల్గొన్నారు.