
రాయికోడ్ (కోహిర్), వెలుగు: వేసవిలో జిల్లాలో నీటి ఎద్దడి రాకుండా చూడాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె కోహీర్ మండల కేంద్రంతో పాటు నాగిరెడ్డిపల్లి , దిగ్వాల్ గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులపై ఫైర్ అయ్యారు. చెత్తను కాల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించారు.
పెండింగ్‌లో ఉన్న మిషన్ భగీరథ పైప్లైన్లు పూర్తి చేసి నీటి నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం నాగిరెడ్డిపల్లి ప్రాథమిక, ఉన్నత స్కూల్స్‌ను తనిఖీ చేశారు. స్టూడెంట్స్‌తో ముచ్చటిస్తూ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతున్నారని అడిగారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రాజు, మండల ప్రత్యేక అధికారి జంగారెడ్డి, తహసీల్దార్ బాల శంకర్, ఎంపీడీవో భారతి, మిషన్ భగీరథ ఇంజనీర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.