
సంగారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను స్పీడప్చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ, ఇరిగేషన్, ఈ డబ్ల్యూ ఐడీసీ చేపట్టిన, పూర్తయిన పనులపై కూలంకషంగా చర్చించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, పీహెచ్సీలు, ఎంసీహెచ్, సబ్ సెంటర్ల పనులు, మన ఊరు మనబడి పనులను వేగవంతం చేయాలని సూచించారు. పూర్తయిన భవనాలను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.
ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్‌డీఓ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ గాయత్రీ దేవి, జీజీహెచ్సూపర్నెంట్ డాక్టర్ అనిల్ కుమార్, డీసీహెచ్ ఎస్డాక్టర్ సంగారెడ్డి, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, ఈడబ్ల్యుఐడీసీ, టీఎస్ఎంఐడీసీ ఈఈలు, డీఈలు పాల్గొన్నారు.