
సంగారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలోని అంగన్వాడీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్, బాలసదన్బిల్డింగ్స్స్పీడప్ చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టర్ఆఫీసులో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీడీపీవోలు
సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లకు సూచించారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్, డీడబ్ల్యూవో సంధ్యా రాణి, పంచాయతీరాజ్ శాఖ ఆఫీసర్సంగారెడ్డి, ఆందోల్ ఈ ఈలు, సీడీపీవోలు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములు కాపాడాలె
మున్సిపాలిటీ పరిధిలోగల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టర్ ఆఫీసులో సంగారెడ్డి మున్సిపల్ అధికారులతో పనుల పురోగతిపై అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు.
ఆయా ప్రభుత్వ భూముల దగ్గర మొక్కలు నాటాలన్నారు. రాజీవ్ పార్క్ అభివృద్ధికి అంచనా ప్రతిపాదనలు తయారు చేయాలని కమిషనర్ ను ఆదేశించారు. వంద శాతం పన్ను వసూళ్లు కావాలని సూచించారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ సుజాత పాల్గొన్నారు.