16 మంది తహసీల్దార్ల బదిలీలు

16 మంది తహసీల్దార్ల బదిలీలు

సంగారెడ్డి, వెలుగు:సంగారెడ్డి జిల్లాలో 16 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ వల్లూరి క్రాంతి గురువారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి తహసీల్దార్లకు స్థానచలనం కలుగగా, కొందరు ఇతర జిల్లాల నుంచి బదిలీపై వచ్చారు.

సంగారెడ్డి తహసీల్దారుగా దేవిదాస్, కోహిర్ కు బాల శంకర్, పటాన్ చెరుకు రంగారావు, నారాయణఖేడ్ తహసీల్దార్ గా భాస్కర్, ఆందోల్ కు భాస్కర్ కుమార్, పుల్కల్ మండలానికి కృష్ణ, మనూర్ మండలానికి వెంకటస్వామి, జిన్నారంకు భిక్షపతి, అమీన్పూర్ మండలానికి రాధ, జహీరాబాద్ కు మహేశ్ కుమార్, హత్నూరకు ఫరీన్ షేక్, కల్హేర్ మండలం తహసీల్దార్ గా రాజాగణేశ్ బదిలీ అయ్యారు.