పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలి : కలెక్టర్ ​క్రాంతి

పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలి : కలెక్టర్ ​క్రాంతి

రామచంద్రాపురం, వెలుగు : నెల రోజుల వ్యవధిలో పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్​ వల్లూరి క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం తెల్లాపూర్​ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించి పలు అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. అనంతరం రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. తెల్లాపూర్​ పరిధిలోని మూడు చెరువులకు హద్దులు నిర్ణయించి ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. మున్సిపల్​ ఆఫీస్​ పక్కన కొత్తగా నిర్మిస్తున్న ఫంక్షన్​ హాల్ పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. 

సర్వే నంబర్ 323 లో హాస్పిటల్, పీహెచ్​సీ సెంటర్ పనులను మొదలు పెట్టాలని ఇందుకోసం శాఖపరమైన ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పనిచేసి ఎఫ్టీఎల్​, బఫర్​ జోన్​ల మార్కింగ్ చేయాలని సూచించారు. మండల వ్యాప్తంగా 4 వేలకు పైగా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు వచ్చాయని, వారంలోగా వాటిని పూర్తి చేసి నివేదిక అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.