సూర్యాపేట, వెలుగు : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకట్‌రావు కోరారు. స్వీప్ కార్యక్రమంలో ఓటర్లను చైతన్య పరిచేందుకు సిద్ధం చేసిన సెల్ఫీ పాయింట్లను శుక్రవారం కలెక్టరేట్‌లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సెల్ఫీ పాయింట్లను జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు పంపిస్తామని
ఓటర్లు ఈవీఎం, వీవీఫ్యాట్లపై ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో, స్విప్ నోడల్ ఆఫీసర్ అశోక్, ఎన్నికల సిబ్బంది ఉన్నారు.