టెన్త్‌, ఇంటర్‌‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : యస్. వెంకట్‌రావు 

సూర్యాపేట, వెలుగు: టెన్త్, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకట్‌ రావు విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డితో కలిసి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయని చెప్పారు.

జిల్లాలోని 77 కాలేజీల్లో  16, 602 మంది విద్యార్థులు ఉండగా 32 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.  మార్చి 18 నుంచి ఏప్రిల్ నెల 2 వరకు జరిగే టెన్త్‌ పరీక్షల కోసం 67 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  345 స్కూళ్లలో  11, 946 మంది రెగ్యులర్‌‌ విద్యార్థులు,  187 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నట్లు చెప్పారు. టైమ్‌ దగ్గర పడుతుండడంతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని,   వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.  

ప్రజావాణికి తప్పనిసరిగా రావాలి 

ప్రజావాణికి జిల్లా, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని  కలెక్టర్ వెంకట్‌రావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజలను అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలకు సంబంధించిన 24,  ఇతర శాఖలకు సంబంధించి 37 అర్జీలు వచ్చారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ..  వేసవి దృష్ట్యా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో  తాగునీటి సమస్య  ఉత్పన్నం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.  ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్‌ను వృథా చేయోద్దని, జీపీల్లో టైమింగ్ ప్రకారం స్ట్రీట్ లైట్స్ అన్‌ఆఫ్‌ చేయాలని సూచించారు.  రాష్ట్ర స్థాయి ప్రజావాణి ద్వారా జిల్లాలకు  319 దరఖాస్తులు రాగా..  215 పరిష్కరించామని చెప్పారు.

also read : పార్లమెంట్‌ ఎన్నికల్లో నోడల్ అధికారుల పాత్ర కీలకం : హరిచందన