మార్చి 5 నుంచి ప్రజాపాలన సేవా కేంద్రాలు : కలెక్టర్ వెంకట్‌‌రావు

సూర్యాపేట, వెలుగు : ప్రజాపాలన సేవా కేంద్రాలను సోమవారం నుంచి ప్రారంభించాలని కలెక్టర్ వెంకట్‌‌ రావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌‌ నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంపీడీవో కార్యాలయాల్లో శనివారం సాయంత్రం కల్లా ప్రజా పాలన సేవా కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు.  సూర్యాపేట మున్సిపాలిటీలో ఐదు, హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌, తిరుమలగిరి  మున్సిపాలిటీలో రెండు, కోదాడలో మూడు

నేరేడుచర్లలో ఒక సేవా కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.  ఈ కేంద్రాలు శాశ్వత ప్రతిపాదన పనిచేసే అవకాశం ఉన్నందున  ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు కంప్యూటర్ ఏర్పాటు కోసం ప్రతి మండలానికి రూ.26 వేలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో సరైన వివరాలు నమోదు చేయకపోయినా, కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్నా ఈ సెంటర్లకు వెళ్లాలని సూచించారు.   ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో అప్పారావు,  మున్సిపల్ కమిషనర్లు,  ఎంపీడీవోలు,  స్పెషల్ అధికారులు పాల్గొన్నారు.

ఎంప్లాయ్ మెంట్ కార్డుల జారీకి స్పెషల్ డ్రైవ్

హుజూర్ నగర్, వెలుగు:   హుజూర్ నగర్, కోదాడ నియోజక వర్గాల నిరుద్యోగ యువతీ, యువకులకు ఎంప్లాయ్ మెంట్ కార్డుల జారీ కోసం స్పెషల్ డ్రైవ్‌‌ నిర్వహిస్తున్నామని కలెక్టర్ వెంకట్‌‌రావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.  ప్రతినెల మొదటి బుధ, గురు, శుక్ర, వారాల్లో హుజూర్ నగర్ ఆర్డీవో  స్పెషల్ డ్రైవ్ ఉంటుందన్నారు.

నిరుద్యోగులు ఒరిజినల్ సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, ఫొటోతో అప్లై చేసుకోవాలని సూచించారు. www.employment.telangana.gov.in  వెబ్సైట్‌‌లో కూడా నమోదు చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు 9030206741 నంబర్‌‌‌‌లో సంప్రదించాలని   కోరారు.