యాడ్స్‌‌, పెయిడ్ ఆర్టికల్స్‌‌ రికార్డు చేయండి : వెంకట్‌‌రావు

సూర్యాపేట, వెలుగు :  పత్రికలు, న్యూస్ చానళ్లు, సోషల్ మీడియాలో అభ్యర్థుల గురించి వచ్చే యాడ్స్‌‌, పెయిడ్ ఆర్టికల్స్‌‌ను పక్కాగా రికార్డు చేయాలని  కలెక్టర్ వెంకట్‌‌రావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌‌లో ఏఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి  ఎంసీఎంసీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  యాడ్స్‌‌, పెయిడ్ ఆర్టికల్స్‌‌పై గుర్తించి..  నియోజక వర్గాల ఆర్‌‌‌‌వోలకు తదుపరి చర్యల కోసం పంపించాలని సూచించారు.  

Also Read :- బాల్కసుమన్ గూండాయిజానికి ఇదే నిదర్శనం : వివేక్ వెంకటస్వామి ఆగ్రహం

అలాగే వ్యయ పరిశీలకులకు సమాచారం అందించాలని చెప్పారు.  సోషల్ మీడియా వచ్చే వార్తలు, ప్రకటనల కట్టడికి ట్రాకింగ్ ద్వారా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న వివరించారు.  ఇందుకోసం నోడల్ అధికారితో పాటు కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీ ట్రాకింగ్ చేసి రిపోర్ట్ అందిస్తుందని, పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో  డీపీఆర్‌‌‌‌వో రమేశ్ కుమార్, డీఈ మల్లేషం,  కమిటీ సభ్యులు వీరా రెడ్డి, బి. కృష్ణ, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.