సోషల్ మీడియాపై నిఘా పెట్టినం : వెంకట్ రావు

సూర్యాపేట, వెలుగు :  జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు, వార్తలపై నిఘా పెట్టామని కలెక్టర్ వెంకట్ రావు చెప్పారు. కలెక్టరేట్‌‌‌‌లో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్‌‌‌‌‌‌‌‌ను మంగళవారం అడిషనల్  కలెక్టర్ ప్రియాంకతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఫేస్‌‌‌‌బుక్, ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌, వాట్సప్, యూట్యూబ్, ఎక్స్‌‌‌‌ తదితర సామాజిక మాద్యమాల్లో అభ్యర్థుల ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేస్తున్నామని చెప్పారు.  

సోషల్‌‌‌‌ మీడియాలో ప్రచారాలకు సంబంధించి  ఈ కేంద్రం ద్వారా ముందుగా  అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు.  ఎన్నికల కోడ్‌‌‌‌ను దాటి సోషల్ మీడియాలో వచ్చే ప్రసారాలను పరిశీలనలో తీసుకొని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో సురేశ్,  సీపీవో వెంకటేశ్వర్లు,  డీపీఆర్‌‌‌‌‌‌‌‌వో రమేశ్ కుమార్, డీఐఈ మల్లేశం, ఏవో సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.