
సూర్యాపేట, వెలుగు: వ్యాసరచనతో విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెరుగుతుందని కలెక్టర్ వెంకట్‌రావు చెప్పారు. జిల్లాలో ఆర్‌బీఐ ఫైనాన్షియల్ లిటరసీ వీక్‌లో భాగంగా నిర్వహించిన పలు కాంపిటీషన్లలో గెలుపొందిన జీపీహెచ్ఎస్ ఆత్మకూరు (ఎస్) విద్యార్థిని జే. మౌనిక, మోడల్ స్కూల్ విద్యార్థిని పి. శ్రీహర్షిత ఏ. శ్రీధర్‌కు మంగళ వారం క్యాష్ ఫ్రైజ్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్‌డీఎం బాపూజీ, డీఏవో అశోక్, ప్రిన్సిపాల్ శంకర్ నాయక్, హెచ్‌ఎం శంకర్, ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ జనార్దన్ పాల్గొన్నారు.