ఆఫీసుల్లో ప్లాస్టిక్ వాడొద్దు : కలెక్టర్ వెంకటరావు

సూర్యాపేట, వెలుగు: ప్లాస్టిక్  రహిత సమాజం కోసం కృషి చేయాలని, ఆఫీసుల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడొద్దని కలెక్టర్ వెంకటరావు అన్నారు. శనివారం  కలెక్టరేట్​లోని ఆఫీసులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ ని వాడితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, హాస్టళ్లలో, అన్ని మున్సిపాలిటీలలో ప్లాస్టిక్ బాటిల్స్, సంచులు, ప్లాస్టిక్ కవర్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దని సూచించారు.

 ప్లాస్టిక్ నివారణకు అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ఆఫీసులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సూచించారు. డీటీవో శ్రీనివాస్ రావు, డీపీఆర్​వో రమేశ్ కుమార్, ఏవో సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.